Friday, December 10, 2010

నేను సుమ్మేషు

ఫోటో ఫ్రేము

చాలా రోజుల తరవాత మళ్ళా నా టపా డబ్బాలో ఏదో రాయాలని అనిపించింది. పోయిన సారి రాసిన టపా కి ఈ సారి టపాకి మధ్యలో చాలా విషయాలు జరిగాయి

ఒకటి. నా నిశ్చితార్థం
రెండు. నిశ్చితార్ధం లో నా కుడి కంటికి దెబ్బ తగలటం. అది ఈ రోజు వరకు ఇంకా బాధిస్తుంది
మూడు. నా పెళ్లి. నిశ్చితార్థం కి పెళ్లికి నెలకంటే తక్కువ సమయం ఉండటం గమనార్హం!
నాలుగు. నా పెళ్లి అయిన వారం రోజులలోనే నేను ఒక్కడినే విదేశాలకు రావటం
అయిదు: ఇక్కడ నా కంటికి తగిలిన దెబ్బ వల్ల సరిగ్గా పని చెయ్యలేక పోవటం....

ఇలా....అన్ని చక చక జరిగిపోతున్నాయి....

ఇవన్ని జరిగినా నాకు ఎప్పుడు టపా రాయాలని అనిపించలేదు...ఏదో జీవితం అలా అలా సాగిపోతుంది అన్న ఒక ఆలోచన....(పెళ్ళికి సంబంధించిన విషయాలు వేరే టపా లో పూర్తి వివరాలతో రాస్తాను)

మొన్న నల్ల శుక్రవారానికి (బ్లాక్ ఫ్రైడే) ఒక డిజిటల్ ఫోటో ఫ్రేము కొన్నాను....అది కొని పది రోజుల పైనే అవుతుంది...
ఎప్పుడు దాన్ని తెరవలేదు....పని వొత్తిడి వల్ల....కాని ఈ రోజు తెరిచి చూసాను....దానిలో నా పాత చిత్రాలు (ఫోటోలు) ....అవన్నీ చూస్తుంటే చాలా బాగా ..మధురంగా ఉన్నాయి.......
ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది.....ఇదిగో ఇలా టపా రాయాలని అనిపించింది.......

Sunday, December 20, 2009

రాష్ట్ర విభజన - రెండు

ప్రస్తుతం మనం ఉన్న పరిస్తితిలో రాష్ట్ర విభజన కేవలం కొన్ని రాజకీయ పార్టీలకి సంబందించినది కాదు. కెసిఆర్ గారు మరియు మిగితా నాయకులు 1956 నుంచి జరుగుతున్న తెలంగాణా పోరాటము గురించి చెబుతున్నారు ! ఈ పోరాటము ఎంత వరకు ఎవరు నడిపించారు అన్నది ముఖ్యము. ఈ యభైయ్ ఏళ్ళు తెలంగాణా కి ఏమి చెయ్యని తెలంగాణా నాయకులు రేపు కొత్త రాష్ట్రము ఏర్పడినాక ఏమి చేస్తారు?
వీరు రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతున్నారు, రేపు రాష్ట్రము వొచ్చినాక ఎటువంటి విధానము పాటిస్తారో స్పష్టం చెయ్యాలి. తెలంగాణా ప్రాంతం వెనకపడి ఉన్నది అని అనటం లో ఏ మాత్రం సంకోచం లేదు. కానీ ఎందుకు వెనకపడింది, రేపు కొత్త రాష్ట్రముతో పాటు వోచే కొత్త సమస్యలు, ఇంతక ముందు ఉన్న పాత సమస్యలు ఎలా అధిగమించాలో మన కెసిఆర్ గారు తెలంగాణా ప్రజలకి వివరించటం లేదు !

ముఖ్యంగా కొత్త రాష్ట్రము ఏర్పడిన వెంటనే చాలా అయోమయం ఏర్పడనుంది, పరిపాలనా విధంగా కానీ, ఆర్ధికంగా కానీ, అతి పెద్ద సమస్య అయిన నక్సల్యట్ల సమస్య కానీ, ఇలా చాలా సమస్యలు రాష్ట్ర కొత్త నాయకులు అధిగమించాలి.
మరి వీటికి సంధానం ఏంటో?

Friday, December 11, 2009

రాష్ట్ర విభజన !

సమైఖ్య ఆంధ్ర ?

లేక .... తెలంగాణా + రాయలసీమ + కోస్తా

నేను ఎక్కడి వాడిని? ప్రశ్న చాలా మంది తరం యువకులలో ఉంది. వాళ్ళ చిన్న తనం లోనే తల్లి దండ్రులు ఉద్యోగ రిత్యా లేక వ్యాపార నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్న నగరానికి వచ్చి స్థిరపడ్డారు.

సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నగరము రాజధానిగా ఉంది కాబట్టి వివిధ ప్రాంతాలవారు ఇక్కడ ఉన్నారు. రోజు ఎవరో డిల్లీలో కూర్చొని ఇంకెవరో ప్రొద్దుపోని నాయకుడు అన్నం తినటం మానేసాడు అని ఒక ప్రసాంతమైన రాష్ట్రాన్ని విభజించటానికి వెనుకాడలేదు !

ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒక్క సారి రాష్ట్ర ప్రజల మనోగతం తెలుసు కోవాలిసింది. అదే కనక జరిగి ఉంటే ఈరోజు ఇంట మంది ప్రజా నాయకులూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి మూకుమ్మడిగా రాజీనామా చేసేవారు కాదు.
ఘటన రాబోవు ప్రభుత్వాలకు, తరాలకు ఒక గుణపాటం కావలి !

Saturday, October 17, 2009

దీపావళి

ఈ సారి కూడా దీపావళి న్యూ యార్క్ నగరం లో జరుపుకుంటున్నాను. రెండు సంవత్సరాల కింద సరిగ్గా ఇదే రోజు అమెరికా వొచ్చాను. జీవితం లో మొదటి సారి టపాకాయలు కాల్చకుండా, కాలుస్తుంటే చూడకుండా గడిపాను. ఇప్పుడు ఈ సంవత్సరం రెండో సంవత్సరం.
నిన్న అర్ధరాత్రి ఆఫీసు లో గడపాలిసి వొచ్చింది, ఏదో పని, ఇంతలో మా మేనేజర్ తో ఏదో పిచ్చా పాటి మాటలలో ఆయన ఒక వింత విషయం చెప్పారు.
వాళ్ళ పిల్లలకి దీపావళి అంటే ఏంటో తెలీదు అట ! మరి అందరికి ఈ విషయం వింతగా అనిపించక పోవొచ్చు కాని నాకు మాత్రం కొంచం వింతగా అనిపించింది.
అసలు ఏంటి అని ఆరా తీస్తే అయన చెప్పారు, వాళ్ల పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు. ఇక్కడ దీపావళి చేసుకునే పని లేదు. ఎక్కడో దూరంగా ఎవరో ఒక పది నిమషాలు ఆపకుండా టప టప అని ఏవేవో కాలుస్తారు, ఆ కాల్చిన వాటిని వీళ్ళు వీడియోలు ఫోటోలు తీసుకుంటారు. అంతే !!!
అయన పిల్లలు పుట్టినాక ఏ నాడు దీపావళికి భారత దేశానికి వెళ్ళలేదు అంట ! ఇక వాళ్ళకి దీపావళి ఆంటే ఏమి తెలుస్తూంది అని అన్నాడు. నిజమే కదా సుమీ అనుకున్నా. నోటి మీద వేలు వేసుకున్నా.

భారత దేశం లో పరిస్థితి ఏదో బాగుంది, పిల్లలు పండగలు బాగా చేసుకుంటున్నారు అని కాదు. అక్కడ కూడా ఇదే పరిస్థితి, ప్రతి పండగ పేరు ముందు 'హ్యప్పి' అని చేర్చి ఎస్.ఎం.ఎస్ ఒకటి పంపుతారు, మరీ తెలిసిన వారు ఐతే ఒక ఈ-మెయిలు పంపుతారు.

ఇన్ని చెప్పి నేను ఏమి చేశాను ఆంటే నేను కూడా అదే ఈ-మెయిలు అదే ఎస్.ఎం.ఎస్ పంపుతున్నా !

Sunday, August 9, 2009

సాఫ్ట్ వేరిజం !

సాఫ్ట్ వేరిజం ! టెర్రరిజం లాగా సాఫ్ట్ వేరిజం ఏంటా అనుకుంటున్నారా ! ఏమి లేదు.... సాఫ్ట్ వేరు కస్టాలు....

ఈ పోస్ట్ లో డొంక తిరుగుడు లేకుండా నేరుగా విషయానికి వొచ్చేస్తా .....ప్రస్తుతానికి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరుని .....మరి నా జీవితం కూడా అలంటి సాఫ్ట్వేర్ ఇంజనీరు లాగానే ఉంటుంది.
సాఫ్ట్వేర్ అంటేనే ఈమేళ్ళు, ఫోర్వార్డ్లు, పైన కాంటీన్ లో సిట్టింగ్లు...
ఇక్కడ రెండు రకాల సిట్టింగులు ఉంటాయి......ఉద్యోగం లో చేరి మొదటి రెండు మూడు నలుగు సంవత్సరాలు అవుతున్న వారు అంతా ఒక గుంపు...ఇక మేనేజేర్లు ఇతరేతర అంతా ఒక గుంపు....
ఇంతకీ ప్రతి రోజు పొద్దున్న మధ్యాహ్నం వీరు మాట్లాడుకునేది ఎంటిరా అంటే ఏమి ఉండదు....మన ఆడవాళ్లు మధ్యాహ్నం అన్నము తిన్నాక పిల్లలు స్కూళ్ళ నుంచి వొచ్చే మధ్యలో మాట్లాడుకునే భాగోతమే.....వాడు ఇలా వీడు ఇలా ....అది ఆలా ఇది ఆలా !
చెన్నై ఆఫీసు లో తెలుగుగోళ్ళు అంతా ఒక గుంపు....హైదరాబాద్ ఆఫీసు లో తమిలోళ్ళు అంతా ఒక గుంపు.....ఎక్కడ ఉన్నా ఉత్తరాది వాళ్లు మంచి చపాతీ పాలక్ పన్నీరు దొరకదు అని అనుకోవడమే ....

ఇక ప్రాజెక్ట్లలో కూడా రెండు రకాలు.....డెవలప్మెంట్ ప్రాజెక్టు ...సపోర్ట్ ప్రాజెక్టు....

డెవలప్మెంట్ ప్రాజెక్ట్లలో ఉండే వాళ్ళు ఎక్కువ టెన్షన్ కి లోను అవుతారు....ఏదో తెగ కష్ట పడిపోతుంటారు .....ప్రతి రోజు ఇంటికి వెళ్ళే సరికి రాత్రి పన్నెండు ఒంటిగంట......ఏదో క్లైంట్ కి డెమో ఇవ్వాలి...ఈ వారాంతానికి రిలీజ్ ఉంది....మొన్న ఇచిన బిల్డులో టెస్టింగ్ వాళ్ళు పాతిక బుగ్గులు వెతికారు అంటా !!.....అది చూడగానే మొదట టీం లీడ్ గుండె ఆగిపోతుంది....ఇంకొంచం సేపు తరవాత ప్రాజెక్ట్ మేనేగేర్ గుండె దాదాపు ఆగుతుంది....ఇక ప్రాజెక్ట్ మేనేగేర్ మాత్రం ఆన్ సైటు వాడికి ఫోన్ చేసి (అక్కడ వాడికి అర్ధ రాత్రి అయి ఉంటుంది అన్న విషయాన్నీ మర్చిపోయి) క్లైంట్ కి ఏదో సర్ది చెప్పమని చెప్పి ఒక పది రోజులు టైం అడిగి తీసుకోమని చెపుతాడు....ఈ భాగోతము అంతా అయిపోయే లోపల ఇక్కడ ప్రాజెక్ట్ జనాలు తలలు కంపుతెర్లకేసి బాదేసుకున్తుంటారు....ఇంతలో ఎవరికో ఒకటి రెండు రోజులు సెలవు కావలి ....అక్క పెళ్లి చెల్లి పెళ్ళిళ్ళు ఉన్నా వాళ్లు కూడా అర్ధ రాత్రుళ్ళు అపరాత్రుళ్ళు కూర్చొని పని చేస్తుంటారు....ఏమి చేస్తాము !

ఇక రెండో రకం సపోర్టు ప్రాజెక్టులు ....ఇలాంటి ప్రాజెక్టులలో అంతా ఒక పద్దతి ప్రకారం జరుగుతుంది...ఆన్ సైటు వాడికి ఆఫ్షోర్ వాడికి మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది (ఆలా లేదు అంటే ఇక ఈ ప్రాజెక్టు కూడా నరక యాతనే !)....మావా నువ్వు ఇది చెయ్యి...నేను ఇది చేస్తా....నువ్వు క్లైంట్ కి వారం అని చెప్పు...మేము ఇక్కడ రెండు రోజులలో చేసిన బిల్డు మాత్రం వరం తరవాత ఇస్తాము.....మిగితా మూడు రోజులు నువ్వు అక్కడ జల్సా చెయ్యి...మేము ఇక్కడ జల్సా చేస్తాము అని ఒక అండర్ స్టాండింగ్ లో ఉంటారు.....కాకపోతే ఒంట్లో బాలేదు ఇంట్లో కస్టాలు అని వెంటనే ఒకటి రెండు రోజులు సెలవు పెట్టటానికి ఉండదు.....కనీసం నెల ముందు అయినా చెప్తే ప్రాజెక్ట్ లీడ్ అసలు వీడికి సెలవు ఇవ్వాలో లేదో ఆలోచించుకొని...ఒక ఇరవయి ముఫై ఈ మైళ్ళు అటు ఇటు పాంపి...ఒక రోజు సెలవు ఇస్తాడు ! .....

ఈ వొత్తిడిని తట్టుకోలేక ప్రతి రోజు కనీసం అయిదు కాఫీ లన్నా తాగాల్సి వొస్తుంది....సాయంత్రం జిహ్వ చాపల్యం కొద్ది కాంటీన్ కి వెళ్లి...ఒక ప్లేటు భెల్ పూరి...ఒక కూల్ డ్రింకు లేక ఒక జ్యుసో పట్టించి తిరిగి వొచ్చే టప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ తెచ్చుకోవడము....ఇవన్ని మన వొంటికి పడక కొన్ని రోజుల తరవాత త్రేపులు ....వాంతులు.....
సరే కదా మన మెడికల్ ఇన్సురన్సు వాడుకొని డాక్టరు దగ్గరకు వెళితే ....మూడు వొందల రకాల పరీఖ్సలు...ఆరు వొందల రకాల పరీక్షలు.....ఎందుకు ఇంత కర్చు డాక్టరు గారు అంటే....నువ్వు ఏమి బాధ పడకు నాయన మీ మెడికల్ ఇన్సురన్సు వాళ్ళు చూసుకుంటారులే అని కొట్టి పారేస్తాడు.....

అసలు అన్నింటికంటే హాస్యాస్పదం అయిన విషయం ఏంటంటే ! ఆ క్లయంటు ఎవడో ఎక్కడూ అమెరికాలోనో ...లోన్దొంలోనో ఉంటే .....మనం ఎం ఎం సి అని ఇక్కడ ఫార్మల్ చొక్కాలు, ప్యాంట్లు బూట్లు టైలు వేసుకొని జనాలు తెగ మురిసిపోతుంటారు ! తీర ఆ క్లిఎంటు దగ్గర పని చేసే వాళ్ళు మాత్రం చిరిగిన జీన్స్ ...యమః బికేస్ మీద వొస్తుంటారు !

ఇది ఒక అంతు లేని కధ !!! మరో చరిత్ర !!! ఇలా చెప్పు కుంటూ వెళితే ఎన్నో యుగాలు పడుతుంది......ఇక నేను వెళ్లి ఈ రోజు (ఈ రోజు ఆదివారము) సాయంత్రము ఉన్న మీటింగుకి సిధమవుతాను !

ఇట్లు
ఒక నిస్సహాయ సాఫ్ట్వేర్ ఇంజనీరు

Friday, November 28, 2008

బజ్జి బండి దగ్గర సుందరి

ఏదో ఆఫీసు కస్టాలు ఆలోచించుకుంటూ ఆఫీసు నుంచి వెనక్కి వస్తూ మన జే ఎం టి యు గేటు పక్కన ఉన్న బజ్జీల బండి మీద బజ్జీలు తిందాము అని బండి ఆపాను. అల ఆపి ఆ బజ్జిలబ్బాయిని తన మేనుని చెప్పమని అడిగా. వాడు నావైపు ఒక ఏటకారమైన చూపు చూసి, "ఒక నిమిషం ఆగండి సర్" అన్నాడు. అంతలో నేను ఊరుకోక ఒక ఉల్లి బజ్జి ఉంటే ఇవ్వు ఏదో పంటి కింద నమిలినట్టు ఉంటుంది అని అన్నాను, నువ్వే తీసుకో అనట్టు చూసాడు. ఆ చూపు అర్థం నాకు అర్థం అయ్యి నేనే ఆ బజ్జి ఏదో తీసుకొని నోట్లో వేసుకొని నమలటం మొదలు పెట్టాను.
ఇంతలొ ఎక్కడ నుంచి వచిందో ఒక అమ్మాయి, అదే మెరుపుతీగ లాంటి అమ్మాయి, నా పక్కకి వచ్చి నుంచుంది.
ఆ అమ్మాయి కళ్ళద్దాలు తీసి తన పర్సు లో పెట్టుకుంది.
ఆ అమ్మాయి ఏమి కొంటుందో అని ఒక వెర్రి ఆలోచన. ఇంతలో ఆ బజ్జి బండి అతను బజ్జీలు, ఉల్లిపాయలు, కారం, మసాలా, అన్ని ఉడకేసిన బఠాణాలు, కొన్ని పల్లీలు వేసి ఏదో తయారు చేస్తున్నాడు నేను వెంటనే నాకు కూడా అదే చేసి ఇవ్వమని చెప్పను, వెంటనే నా పక్కన ఉన్న అమ్మాయి కూడా నాకు కూడా అని అదే అని చెప్పింది.
అంతలో ఆ పక్కన ఉన్న కుర్రాడు ఆ సారు వాళ్ళకి రెండు బజ్జి మిక్చరు ఇవ్వు అని చెప్పాడు. ఆ అమ్మాయి నా వైపు చూసి నవ్వల వొద్దా అన్నా మొహం పెట్టింది. నేను వెంటనే ఒక చిన్న చిరు మంద హాసం విసిరా !
దానితో ఆ అమ్మాయి తిరిగి ఒక నవ్వు నవ్వింది. మొత్తానికి వాడు మేము ఇద్దరమూ కలిసి వచ్చాము అని అనేసుకొని మా ఇద్దరికీ మిక్చరు కలిపి ఇచ్చాడు.
ఏదో ఇక మాట్లాడాలి కదా అని మీరు ఎక్కడ పని చేస్తున్నారు అని అడిగాను. ఆ అమ్మాయి ఏదో పెద్ద బ్యాంకు పేరు చెప్పింది. మనకి బ్యాంకుల గురించి ఎందుకు లే అని గమ్మున నా మిక్చరు నేను తిన సాగాను. అంతలో ఆమె మీరు ఎక్కడ పని చేస్తారు అని అడిగింది. నేను మన సత్యం కంప్యూటర్స్ లో అని చెప్పా. ఓహో తుమ్బ్రి సాఫ్ట్వేర్ ఇంజనీరా అన్నా చూపు చూసింది (మొదటి లో ఈ సాఫ్ట్వేర్ బూం పడిపోయే ముందు ఎవరన్న అల చూస్తె కోపం వోచేది ! ఈ మధ్య అలవాటు అయిపొయింది). అల ఒక పడి నిమిషాలు నెమ్మదిగా తిని పక్కన చెరొక టెంకాయ తాగి "నైస్ మీటింగ్ యు...నైస్ మీటింగ్ యు"లు చెప్పుకొని ఎవరి దారిన వారు పోవడానికి వెనక్కి తిరిగాము అంతలో ఎద్దైనుంచో "యజ్ఞ ...యజ్ఞ లెగు ఆఫీసు కి వెళ్ళవా" అని ఒక గొంతు వినిపించింది !
అప్పుడు అర్థం అయింది తెల్లవారుజామున తొమ్మిది అయింది అని !!!
(మన సుడి అంతే రా అనుకోని లెగిచి ..........)

Bussu Manadiroiii

Bussu Manadiroiii
Bussu Manadiroiii

Telengana Samburalu

Telengana Samburalu
Gondla tala.... paga ? or pinchalu ??

Video Bar

Loading...

Video Bar

Loading...

Blog Archive