Tuesday, February 5, 2008

అడక్కతినే పద్దతుల విసదీకరణ

ఇది ఇంకో స్టోరి.....మొన్న ఏదో పని మీద వేరే వూరు వెళ్ళటానికి మన భారతీయ రైలు బండి ఎక్కా....అదే మన కృష్ణ express...అందులో అన్ని కంపార్ట్మెన్ట్లు జనరల్ లాంటి సెకండ్ క్లాస్....ఆ బండి తిరుపతి నుండి నిజామాబాదు వెళ్తుంది....నా ప్రయాణం రెండు గంటలు ....ఈ రెండు గంటలలో ఆ రోజు నేను చాల చాల వింత అయిన అడక్కతినే styles చూసా....
Q) బాల్యాన్ని అడక్కతినటానికి ఎలా ఉపయోగించాలి ?
Ans) చిన్న పిల్లలం పెద్దవారు ఎవరు లేరు....ఆకలి వేస్తుంది....మూడు లేక రెండు రోజులు అయింది తిండి తిని......అని కాని....లేక బాగా తెలివి గల్ల పిల్లలు అయితే ......చదువుకోవడానికి డబ్బులు లేవు....స్కూల్ బట్టలు కుట్టించుకోవాలి....పుస్తకాలకి అట్టలు లేవు వేసుకోక పోతే టీచర్ తిడుతుంది.....ఇలా ఎన్నో ఎన్నెన్నో.....పిల్లాడి టాలెంట్ పెరిగే కొద్దికి రీజన్స్ మారుతూ మెరుగుపడుతూ ఉంటాయి......
Q) యవ్వనం లో ఎలా అడక్కతినాలి ? (ఈ పద్దతి ముఖ్యముగా ఆడ లేడీస్ కి బాగా ఉపయోగపడుతుంది !)
Ans) ఈ procedure కి ఒక సహాయ నటి కావలిసి వస్తుంది......ఆదే support character అన్నమాట......మరి costumes కూడా అవసరము అవుతాయి .......so కొంచం investment చేయ్యాలిసిన అవసరము కూడా ఉంటుంది...ఏంటా అది అని ఆలోచిస్తున్నారా ?పెళ్లి కూతురు character ! .... రైలు ఎక్కి కూర్చున్న వాళ్ళని అందరిని రేపు కొండ మీద దుర్గమ్మ సన్నిధిలో పెళ్లి....పెళ్లి చీర కొనుక్కోవడానికి డబ్బులు లేవు....అందుకే ఇలా అందరిని అడుకున్తున్నాము అని main charater ఇంక side character...... full dedication తో అడుక్కోవటం.....!!!
Q) మరి బాలింతలు ఎలా అడుక్కోవాలి ?
Ans) ఒక చిన్న బిడ్డని వేసుకొని ఆగిన రైలు ఎక్కేసి.....పది రోజుల బాలింత అని ఒక దీనమయిన మొహం పెట్టి దీనమయిన కధ చెప్తే.....జనాలు flat ! ......
ఇలా ఒక్కోడు ఒక్కో రకంగా కొత్త కొత్త అడక్కతినే పద్దతులు ప్రవేసపెట్టి మన దెస పురోగతికి దోహద పడుతున్నారు !


PS: ఇంటి ఉట్టి రైళ్ళలో అడక్కతింటారు అనుకుంటున్నారా ? మన software ఇండస్ట్రీ లో కూడా నిత్యం మనం చేసేది కూడా ఇదే...... what ! ? #$%$% అనుకుంటున్నారా ? ఒక్క సారి మీ appraisal meeting గుర్తు తెచ్చుకోండి !

0 comments:

Bussu Manadiroiii

Bussu Manadiroiii
Bussu Manadiroiii

Telengana Samburalu

Telengana Samburalu
Gondla tala.... paga ? or pinchalu ??

Video Bar

Loading...

Video Bar

Loading...

Blog Archive