Monday, August 25, 2008
ఆయుర్వేదం డాక్టరు గారు
నిన్న ఆదివారం మధ్యాహ్నం ఒక చిన్న విందు కార్యక్రమంకి హాజరు అయ్యా....ఆ తరవాత నా స్నేహితుడు ఎక్కడికో వెళ్దాము అంటే సరే అని నా బండి మీద బయలుదేరాము....దారిలో చెప్పాడు ఒక ఆయుర్వేదం డాక్టర్ ఉన్నారు అని .....ఎక్కడా అంటే ఎ జి కాలనీ లో ఉంటారు అని చెప్పాడు....ఇల్లు ఎక్కడో కచ్చితం తెలీక పోవడం వల్ల దారిన పోయే వాళ్ళని అడుగుతూ వెళ్ళాము....పోనీ అడిగింది ఇంటి నంబరు లేక ఏదో బండ గుర్తు కాదు....ఇక్కడ ఒక ఆయుర్వేదం డాక్టర్ ఇల్లు ఎక్కడా అని అడిగాము, జనాలు దిక్కు చూపించారు. ఈ హైదరాబాదు మహా నగరము లో ఇలా ఒక వ్యక్తి గురించి విచారించడం ఇదే మొదటి సారి !ఎంటయ్యా అతని గొప్ప అని అడిగాను మా వాడిని, అప్పుడు చెప్పాడు అయనకి అంత పేరు ఎందుకో. అయన రిటైర్ అయిన ప్రభుత్వ డాక్టరు అని, అయన హస్త వాసి మంచిది అని. ఎవరు వెళ్ళినా ఉచితంగా వైద్యం అందిస్తారు, మందులు కూడా ఉచితంగా ఇస్తారు !! వారానికి రెండు రోజులు చూస్తారు, పాత రోగులకి జబ్బు తగ్గే వరకు ఉచితంగా మందులు ఇస్తారు. అయన సేవా భావానికి చాలా ముచ్చట వేసింది. మన వంతు ప్రయత్నం చెయ్యాలి అనిపించింది, మరి చూడాలి, ఆయన డబ్బు తీసుకునే మనిషిగా కనిపించలేదు, బహుశా అయన దగ్గర రెండు రోజులు పని చేసే అవకాసం వస్తే పని చేసి నా వంతు నేను సహాయ పడతా.మా వాడి వంతు వచేసరికి రెండు గంటలు పట్టింది....అక్కడ అయన ఇంటి దగ్గర కాలనీ వాతావరణం అవ్వటం వల్ల చుట్టూ పక్కల చాల ప్రశాంతంగా ఉంది. రెండు గంటలు అక్కడ ఏమి చెయ్యకుండా అలా ప్రశాంతంగా కూర్చున్నా. ఇంతకి అయన పేరు చెప్పడం మరిచిపోయా, అయన పేరు "యోగానంద".
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment