ఈరోజు ఆఫీసు నుంచి త్వరగా వచ్చేసా....ఏమి చెయ్యాలో తోచని ఒక బలహీన క్షణంలో వంట చేసుకుందాము అన్న ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది...
ఎప్పటి నుంచో టమాటో కూర చేసుకోవాలని బలమైన ఆలోచన...వెంటనే వంటింట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయి అని చూసా...ఏమి లేవు....
ఇక నా టమేటా కూరకి రంగం సిద్దం చేశా...మార్కెట్ కి వెళ్లి అరకిలో టమేటాలు, పావు కిలో వంకాయలు, అర కిలో ఉల్లిపాయలు, అన్ని పచ్చి మిర్చి, మూడు నిమ్మకాయలు తెచ్చా...ఈ మధ్య ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన ధరల ప్రభావం కాబోలు మొత్తం సరంజామా ముఫై అయిదు రూపాయలు అయింది.....
ఇక ఇంటికి వచ్చి వెంటనే అన్నీ తరిగేసా....ఒక మూకుడ పెట్టి అంత తాళింపు వేసి, అల్లం వేల్లిఉల్లి పేస్టు వేసి దేవాను..ఆ పోపు దోరగా వేగినాక అందులో ఉల్లిపాయలు పచ్చి మిర్చి వేసాను....మల్లి కొంచం సేపు వేగించి ఇక దానిలో తరిగిన టొమాటోలు వేసాను.....అలా అలా కొంచం సేపు కలపెట్టిన తరవాత తగినంత ఉప్పు వేసి కలపెట్టి మగ్గడానికి మూకుడు మీద మూత పెట్టాను....కొంచం సేపు తరవాత మళ్ళా ఒక సారి కలపెట్టి పొయ్యి ఆపేసా...
ఇంతలో ఎలక్ట్రిక్ కుక్కర్ లో అన్నం వండేసాను...
ఎక్కడో ఏదో తగ్గినట్టు అని పించింది....వెంటనే వంకాయలు కడిగేసి నాలుగు నాలుగు ముక్కల కింద తరిగేసి...నూనలో దేవి అంత ఉప్పు కారం పట్టించా.....
ఇక మిగిలింది ఏంటి !?? ఆవురు ఆవురు మంటూ గుటకలేసుకుంటూ తినటమే !!!
1 comments:
చివర్లో ఎదన్నా ట్విస్ట్ ఇస్తారేమో అనుకున్నా. పొన్లెండి అలాంటివి ఏమీ లేకుండా తినేసారుగా.
Post a Comment