నేను డాక్టర్ అయి ఉంటే బాగుణ్ణు !
ఈ ఉద్యోగ భయం ఎందుకు వచ్చింది ? ఈ డబ్బుతో కూడుకున్న వ్యవహారాలన్నీ ఇలానే ఉంటాయి, పార్టి రోజు గండం, ఈ రోజు ఈ వార్త వినాల్సి వస్తుందో తెలీని భయం...ఆలోచన !
అదే నేను డాక్తోరయ్య (డాక్టరమ్మ లాగా డాక్తోరయ్య అన్నమాట ) అయి ఉంటే ఎలాంటి ఆర్థిక సంక్షోభం వచినా రక పోయినా జనానికి రోగాలు రావటం మాత్రం మానవు !
ప్రతి రోజు ఏదో కోత రోగం పేరు వింటుంటాము..అలా కస్టపడి ఆ రోగానికి మందు కనుక్కుంటాను .....మార్కెట్లో మంచి గిరాకి వస్తుంది...నా దగ్గరకి రోగుల తాకిడి కూడా పెరుగుతుంది !
ఇంకేముంది...అలా అలా ఆ రోగాలన్నితికి వైద్యం చేసుకుంటూ బతికేస్తా !
కాని ప్రస్తుతానికి అలా చేసే అవకాసం నేను కోల్పోయా....ఈ సాఫ్ట్వేర్ జీవితాలు అంతే :(
1 comments:
elections దగ్గిర పడుతున్నాయి కదా... రాజకీయాలని ట్రై చేయండి. అది కుదరక పొతే... కొంచం గడ్డం పెంచి, జుట్టు పెంచి, ఏవో నాలుగు పిచ్చి మాటలు (ఆత్మా వేరు, శరీరం వేరు, జ్ఞానం వేరు, అజ్ఞానం వేరు, ఇలాగన్న మాట) చెప్పితే .. ఇక చూసుకోండి జనాలంతా మీ వెంటే. డబ్బులే డబ్బులు.(వీలు అయితే ఉదయాన్నే టి.వి చూడండి. చాలా మంది సాములు / బాబాలు / అమ్మలు / మాతలు / భగవానులు చెప్పే ఆ నాలుగు పిచ్చి మాటలని బట్టి పట్టండి.)
Post a Comment