సమైఖ్య ఆంధ్ర ?
లేక .... తెలంగాణా + రాయలసీమ + కోస్తా
నేను ఎక్కడి వాడిని? ఈ ప్రశ్న చాలా మంది ఈ తరం యువకులలో ఉంది. వాళ్ళ చిన్న తనం లోనే తల్లి దండ్రులు ఉద్యోగ రిత్యా లేక వ్యాపార నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్న నగరానికి వచ్చి స్థిరపడ్డారు.
సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ నగరము రాజధానిగా ఉంది కాబట్టి వివిధ ప్రాంతాలవారు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఎవరో డిల్లీలో కూర్చొని ఇంకెవరో ప్రొద్దుపోని నాయకుడు అన్నం తినటం మానేసాడు అని ఒక ప్రసాంతమైన రాష్ట్రాన్ని విభజించటానికి వెనుకాడలేదు !
ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒక్క సారి రాష్ట్ర ప్రజల మనోగతం తెలుసు కోవాలిసింది. అదే కనక జరిగి ఉంటే ఈరోజు ఇంట మంది ప్రజా నాయకులూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి మూకుమ్మడిగా రాజీనామా చేసేవారు కాదు.
ఈ ఘటన రాబోవు ప్రభుత్వాలకు, తరాలకు ఒక గుణపాటం కావలి !
4 comments:
తమ రాష్ట్రం తమకు కావాలని తెలంగాణా ప్రజలు 1969 నుంచీ డిమాండ్ చేస్తూనే వున్నారు. ఉద్యమిస్తూనే వున్నారు. అందుకు ఎందఱో బలయ్యారు కూడా.
అంటే సగం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను కోరుకున్తున్నట్టే కదా.
ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ను ఇస్తానని స్పష్టం గా చెప్పి అధికారం లోకి వచ్చింది.
తెలుగు దేశం , ప్రజా రాజ్యం , సి పీ ఐ , బి జే పీ పార్టీలు కూడా తెలంగాణాకు అనుకూలమే అని చెప్పాయి. తమ మానిఫెస్తోల్లో ప్రకటించుకున్నాయి.
అంటే ఈ పార్టీలకు ఓట్లేసిన ప్రజా లంతా ప్రత్యెక తెలంగాణాను ఒప్పుకున్నట్టే కదా.
మొన్నటికి మొన్న రోశయ్య తో జరిగిన అఖిల పక్ష సమావేశం లో "అసెంబ్లీ లో మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామని" అన్ని పార్టీలు హామీ కూడా ఇచ్చాయి, అమ్మ మాటే శిరో దార్యం అని కాంగ్రెస్ నేతలు కూడా పదే పదే ప్రకటించారు .
ఇంకేం కావాలండి???
నిర్ణయం మీకు అనుకూలం కానంత మాత్రాన ఈ వాస్తవాన్ని విస్మరిస్తారా?
ప్రజాభి ప్రాయం అంటే ఏమిటి. తెలంగాణాను ఆంధ్రా లో విలీనం చేసేటప్పుడు ఏవిధమైన ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు 1956 లో ?????
రాజన్న గారు తెలంగాణాకు రాజశేఖర రెడ్డి మాత్రమే అడ్డం అని ప్రచారం చేసి,తెలంగాణాకోసమే పుట్టిన టి.ఆర్.ఎస్. ను ఎందుకు పది సీట్లకే పరిమితం చేసినారో,మరియు కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించి,రాజశేఖరరెడ్డి గారిని సి.ఎం.చేసినారో చెబితే బాగుంటుంది.అదీ టి.ఆర్.ఎస్ మిగతా తోక పార్టీలన్నీ కలిస్తేనే పది సీట్లు అని గుర్తు పెట్టుకోవాలి మరి.
telangana TRS dwara saadhyam ani janam nammaledu anduke 10 seats...daani ardham vallaki interest ledu ani kaadu.
Malleswari gaaru - sare TRS meeda nammakam ledu, mari evari meeda nammakam undi?
Telengana vivadam 50 yella kindatidi antunnaru...mari manam Telugu vallam andaramu gata 5000 vela samvatsaraalu ! mari daani sangathi enti?
Post a Comment